భారత ఉపరాష్ట్రపతికి జీతం ఉంటుందా?

17941చూసినవారు
భారత ఉపరాష్ట్రపతికి జీతం ఉంటుందా?
భారతదేశంలో రాష్ట్రపతి తరువాత రెండో అత్యున్నత పదవి ఉపరాష్ట్రపతి. ఈ బాధ్యతలను తాజాగా సీపీ రాధాకృష్ణన్ స్వీకరించారు. ఆసక్తికర విషయం ఏంటంటే ఉపరాష్ట్రపతికి ప్రత్యేక జీతం ఉండదు. జీతం తీసుకోనప్పటికీ.. ఈ పదవిలో ఉన్న వ్యక్తి, రాజ్యసభ ఛైర్మన్‌గా నెలకు రూ.4 లక్షల వేతనం పొందుతారు. అదనంగా ఉచిత వసతి, వైద్య సేవలు, ప్రయాణ సదుపాయాలు, భద్రత, సిబ్బంది లభిస్తాయి. పదవీ విరమణ తరువాత రూ.2 లక్షల పెన్షన్‌తో పాటు సిబ్బంది, భద్రత, వైద్య సేవలు కొనసాగుతాయి.

సంబంధిత పోస్ట్