పులితో పోరాడి.. రైతును కాపాడి ప్రాణత్యాగం చేసిన శునకం

80చూసినవారు
పులితో పోరాడి.. రైతును కాపాడి ప్రాణత్యాగం చేసిన శునకం
ఉత్తరాఖండ్‌లోని నైనీతాల్‌ జిల్లా మదన్‌పుర్‌ గైబువా గ్రామంలో, రైతు రక్షిత్‌ పాండే తన పెంపుడు శునకం ‘పైలట్‌’తో కలిసి చెరకుతోటలో కోతలకు వెళ్లారు. అకస్మాత్తుగా దాడి చేసిన పులిని అడ్డుకొని, యజమానిని కాపాడేందుకు ‘పైలట్‌’ వీరోచితంగా పోరాడింది. ఈ పోరాటంలో తీవ్రంగా గాయపడిన శునకం అక్కడికక్కడే మృతి చెందింది. గ్రామస్థులు చేరుకునేలోపే పులి పారిపోయింది. శునకం మృతితో యజమాని కన్నీరుమున్నీరయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్