
గిటార్‌ను హెల్మెట్ లేని ప్రయాణికుడిగా గుర్తించిన AI కెమెరా.. రూ. 500 జరిమానా
బెంగళూరులో ట్రాఫిక్ నిబంధనల పర్యవేక్షణ కోసం ఏర్పాటు చేసిన ఏఐ కెమెరా సాంకేతిక లోపంతో విచిత్రంగా జరిమానా విధించింది. టూ-వీలర్‌పై వెళ్తున్న సౌవిక్ దత్తా వీపుకు ఉన్న గిటార్‌ను, హెల్మెట్ లేని వెనుక ప్రయాణికుడిగా భావించి రూ. 500 చలాన్ పంపింది. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో, నెటిజన్లు ఫన్నీ మీమ్స్‌తో స్పందించారు. స్పందించిన బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు ఆ చలాన్‌ను రద్దు చేశారు.




