దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం స్వల్ప నష్టాలతో ముగిశాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, ముడి చమురు ధరల పెరుగుదల, విదేశీ సంస్థాగత మదుపర్ల అమ్మకాలు, లాభాల స్వీకరణ వంటి కారణాలతో సూచీలు ఒడిదుడుకులకు లోనయ్యాయి. సెన్సెక్స్ 114 పాయింట్లు నష్టపోయి 77,844 వద్ద స్థిరపడగా, నిఫ్టీ ఫ్లాట్‌గా ముగిసింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 25 పైసలు కోలుకొని 94.24కు చేరింది. హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, బజాజ్ ఆటో వంటి షేర్లు రాణించగా, హెచ్‌యూఎల్, టీసీఎస్ వంటి షేర్లు నష్టపోయాయి.