దేశీయ మార్కెట్లు సానుకూల సంకేతాలతో బుధవారం భారీ లాభాల్లో ట్రేడయ్యాయి. ఆసియా మార్కెట్లలోని సానుకూలతలు, కనిష్ఠాల వద్ద కొనుగోళ్లు మార్కెట్లకు ఊతమిచ్చాయి. దీంతో సెన్సెక్స్ ఒక దశలో 900 పాయింట్లకు పైగా పెరిగి 77,826 వద్ద, నిఫ్టీ 288 పాయింట్లు పెరిగి 24,284 వద్ద ట్రేడయ్యాయి. బ్రెంట్ క్రూడ్ ధర తగ్గడం, మారుతీ సుజుకీ షేరు 4 శాతం పెరగడం కూడా మార్కెట్లకు సానుకూలించాయి. అయితే, కొన్ని షేర్లు నష్టాల్లోనూ ఉన్నాయి.