దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ నష్టాల్లో ప్రారంభమయ్యాయి. పశ్చిమాసియాలో ఘర్షణలు తీవ్రమవడం, చమురు ధరలు పెరగడంతో సూచీలు పడిపోయాయి. ఇవాళ ఉదయం సెన్సెక్స్ 703 పాయింట్లు నష్టపోయి 76,262 వద్ద, నిఫ్టీ 232 పాయింట్లు కోల్పోయి 23,823 వద్ద ట్రేడయ్యాయి. నిఫ్టీలో కోల్
ఇండియా, సన్‌ఫార్మా, ఓఎన్‌జీసీ, లార్సెన్ షేర్లు లాభాల్లో ఉండగా.. ఇన్ఫోసిస్, ఐషర్ మోటార్స్, శ్రీరామ్ ఫైనాన్స్, విప్రో, ఎంఅండ్ఎం స్టాక్స్ నష్టపోయాయి.