
బర్త్ డే పార్టీలో కేక్ పూశారని కాల్పులు.. ముగ్గురు మృతి(వీడియో)
యూపీలోని బులంద్‌షహర్ జిల్లాలో షాకింగ్ ఘటన జరిగింది. ఖుర్జానగర్ ప్రాంతానికి చెందిన జీతు సైని శనివారం రాత్రి తన పుట్టిన రోజు వేడుక జరుపుకున్నాడు. బర్త్ డే వేడుకలో పాల్గొన్న అమర్‌దీప్ సైని అతడి ముఖానికి కేక్ పూశాడు. దీంతో వారిద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ వివాదంలో అమర్‌దీప్ బంధువులైన మనీష్ సైని, ఆకాష్ సైని జోక్యం చేసుకున్నారు. దీంతో ఆగ్రహించిన జీతు గన్‌తో వారిపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో అమర్‌దీప్, మనీష్, ఆకాష్ మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.




