
దసరా, దీపావళికి అరుణాచలం వెళ్లే భక్తులకు ప్రత్యేక రైళ్లు
ఆంధ్రప్రదేశ్ నుంచి అరుణాచలం (తిరువణ్ణామలై) వెళ్లే భక్తుల సౌకర్యార్థం దసరా, దీపావళి, కార్తీక మాసాల సందర్భంగా రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. నరసాపురం - తిరువణ్ణామలై మధ్య అక్టోబర్ 4 నుంచి నవంబర్ 30 వరకు ఈ రైళ్లు అందుబాటులో ఉంటాయి. ప్రతి ఆదివారం మధ్యాహ్నం నరసాపురం నుంచి బయలుదేరి సోమవారం ఉదయం తిరువణ్ణామలై చేరుకుంటుంది. ఈ రైళ్లు విజయవాడ, నెల్లూరు, తిరుపతి, కాట్పాడి స్టేషన్లలో ఆగుతాయి.




