
అమెరికా అణు పరీక్షలు.. ట్రంప్ సంచలన ప్రకటన
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అణు పరీక్షల పునరుద్ధరణపై సంచలన ప్రకటన చేశారు. పాకిస్థాన్, చైనా, రష్యా, నార్త్ కొరియా వంటి దేశాలు అణు పరీక్షలు నిర్వహిస్తున్నాయని, ఇకపై అమెరికా కూడా అణు పరీక్షలు చేపడుతుందని CBS న్యూస్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. అమెరికా వద్ద ప్రపంచాన్ని 150 సార్లు నాశనం చేసేంత అణ్వాయుధ సామర్థ్యం ఉందని ట్రంప్ పేర్కొన్నారు. పుతిన్, జిన్‌పింగ్‌లతో ఈ అంశంపై చర్చించానని తెలిపారు.




