బీసీల నోటికాడి ముద్ద లాగొద్దు: మంత్రి పొన్నం

7198చూసినవారు
బీసీల నోటికాడి ముద్ద లాగొద్దు: మంత్రి పొన్నం
TG: బీసీల నోటికాడి ముద్దను ఎవరూ లాగొద్దని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. అగ్రవర్ణాలకు 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కల్పిస్తే ఎవరూ వ్యతిరేకించలేదని అన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తే ఎస్సీ, ఎస్టీలకు ఎలాంటి ఇబ్బంది ఉండబోదని తెలిపారు. తమిళనాడు తరహాలో, రాష్ట్రాలు పంపిన బిల్లులు గవర్నర్, రాష్ట్రపతి దగ్గర పెండింగ్‌లో ఉంటే వాటిని రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసుకోవచ్చని సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయడానికి జీవో నెంబర్ 9 తీసుకొచ్చామని వెల్లడించారు.

ట్యాగ్స్ :