రైతులు గుండె ధైర్యం కోల్పోయి ఆత్మహత్యలు చేసుకోవద్దని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. రాబోయే రెండేళ్లలో మళ్లీ కేసీఆర్ రాజ్యం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రైతు సంగ్రామ సదస్సులో రైతుల పక్షాన KTR 4 తీర్మానాలు ప్రకటించారు.
1)కాంగ్రెస్ పాలన వల్ల బలైన రైతుల కుటుంబాలకు రూ.10 లక్షలు ఇచ్చి ఆదుకోవాలి
2)రైతు డిక్లరేషన్లోని హామీలు అమలు చేయాలని
3)అన్ని పంటలను ఆంక్షలు లేకుండా కొనాలి
4)రైతు బంధు, రుణమాఫీ, బోనస్, రైతు భీమా పథకాలు పూర్తిగా అమలు చేయాలని నాలుగు తీర్మానాలు చేసి ప్రభుత్వానికి పంపిన కేటీఆర్