మీ పిల్లలను వైభవ్‌తో పోల్చకండి: హనుమ విహారి (వీడియో)

0చూసినవారు
యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ ప్రతిభపై మాజీ భారత క్రికెటర్ హనుమ విహారి ప్రశంసలు కురిపించారు. కేవలం 15 ఏళ్ల వయసులోనే వైభవ్ సాధిస్తున్న విజయాలు అద్భుతమని పేర్కొన్నారు. అయితే ఇతర తల్లిదండ్రులు తమ పిల్లలను వైభవ్‌తో పోల్చవద్దని సూచించారు. ప్రతి ఒక్కరికీ ఎదగడానికి ప్రత్యేక సమయం ఉంటుందని, ఎవరి ప్రయాణం వారిదేనని అన్నారు. వయసు కేవలం ఒక సంఖ్య మాత్రమేనని, ప్రతిభను నమ్ముకుని కష్టపడితే పిల్లలు తప్పకుండా ఒకరోజు తల్లిదండ్రులను గర్వపడేలా చేస్తారని హనుమ విహారి వ్యాఖ్యానించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్