యువతను ఇలా నిరాశపరచొద్దు: సుప్రీంకోర్టు

51చూసినవారు
యువతను ఇలా నిరాశపరచొద్దు: సుప్రీంకోర్టు
నీట్‌ పేపర్‌ లీక్‌ ఘటనపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. పర్యవేక్షణ ఉన్నా వైఫల్యం ఎలా జరిగిందని కేంద్రాన్ని సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. వ్యవస్థలో జవాబుదారీతనం వచ్చే వరకు అసలు సమస్య ఆగదని వ్యాఖ్యానించింది. జరిగిన సంఘటన యువతకు తీవ్రమైన మానసిక క్షోభను కలిగించిందని.. వారిని ఈ విధంగా నిరాశపరచకూడదని పేర్కొంది. మరోవైపు అఫిడవిట్‌ దాఖలు చేయాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా విద్యార్థుల్లో తీవ్ర ఆందోళన రేకెత్తించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్