
దోమల నిర్మూలనకు ప్రయోగానికి సిద్ధమవుతున్న గూగుల్
వర్షాకాలంలో దోమల బెడద, వ్యాధుల నివారణకు కాలిఫోర్నియాలో గూగుల్ ప్రజారోగ్య రక్షణలో భాగంగా కీలక ప్రయోగానికి సిద్ధమవుతోంది. డెంగీ, జికా వంటి వ్యాధులను వ్యాపింపజేసే ఆడ దోమలను అరికట్టేందుకు, రాబోయే రెండేళ్లలో 3.2 కోట్ల మగ దోమలను ల్యాబ్‌లో ప్రత్యేకంగా అభివృద్ధి చేసి, వాటిలో 'వోల్బాకియా' బ్యాక్టీరియాను ప్రవేశపెట్టి నగరంలో విడుదల చేయాలని గూగుల్ ప్రభుత్వ అనుమతులను కోరింది. ఈ మగ దోమలు ఆడ దోమలతో జతకట్టినప్పుడు వాటి గుడ్లు పొదగవు, తద్వారా దోమల ఉత్పత్తి తగ్గి వ్యాధుల వ్యాప్తి ఆగిపోతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ పద్ధతిని 'ఇన్‌కంపాటబుల్ ఇన్‌సెక్ట్ టెక్నిక్' అంటారు.




