
ఢీకొట్టుకున్న రెండు పడవలు.. 60కి పెరిగిన మృతుల సంఖ్య
ఆఫ్రికా దేశమైన కాంగోలోని Equateur ప్రావిన్స్‌లో సోమవారం ఘోర ప్రమాదం జరిగింది. Ngombe-Lukolela ప్రాంత సమీపంలో కాంగో నదిలో రెండు పడవలు ఢీకొన్నాయి. కిన్షాసా నుంచి వస్తున్న 'Dieu se cache' అనే లోహపు నౌక, బుసింగా నుంచి వస్తున్న 'HB Super Victoire' అనే చెక్క పడవను ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఒక పడవ పూర్తిగా మునిగిపోగా.. సుమారు 60 మంది ప్రయాణికులు మృతి చెందినట్లు సమాచారం. పలువురు ప్రయాణికులు గల్లంతు కావడంతో, రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి.




