
చేవెళ్ల ప్రమాదం.. నాగచైతన్య-మీనాక్షి చౌదరి ఫస్ట్ లుక్ వాయిదా
TG: రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం నేపథ్యంలో, అక్కినేని నాగచైతన్య కొత్త చిత్రం నుండి హీరోయిన్ మీనాక్షి చౌదరి ఫస్ట్ లుక్ విడుదలను మేకర్స్ ఒక రోజు వాయిదా వేశారు. మంగళవారం ఫస్ట్ లుక్ విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. చేవెళ్ల ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం తెలియజేస్తూ, ఇలాంటి దుర్ఘటన సమయంలో సినిమా ప్రమోషన్ చేయడం సరైనది కాదని భావించినట్లు మేకర్స్ తెలిపారు.




