హిప్పోలను చంపొద్దు.. కొలంబియా ప్రభుత్వానికి అనంత్ అంబానీ విజ్ఞప్తి

9006చూసినవారు
హిప్పోలను చంపొద్దు.. కొలంబియా ప్రభుత్వానికి అనంత్ అంబానీ విజ్ఞప్తి
కొలంబియాలోని మగ్డలేనా నది పరివాహక ప్రాంతంలో సుమారు 200 హిప్పోపొటమస్‌ల వల్ల స్థానిక జీవవైవిధ్యం, పర్యావరణ సమతుల్యత, మనుషుల భద్రతకు ముప్పు వాటిల్లుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని కొలంబియా ప్రభుత్వం 80 హిప్పోలను చంపాలని నిర్ణయించింది. అయితే ఈ నిర్ణయాన్ని ఆపాలని రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, వంతారా స్థాపకులు అనంత్ అంబానీ కొలంబియా ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. జంతువులను చంపడం కంటే, వాటిని గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఉన్న వంతారా సంరక్షణ కేంద్రానికి తరలించడం ఉత్తమ పరిష్కారమని ఆయన సూచించారు.

సంబంధిత పోస్ట్