నిమ్మకాయ గింజలు మింగితే ఏమవుతుంది?

5267చూసినవారు
నిమ్మకాయ గింజలు మింగితే ఏమవుతుంది?
వర్షాకాలంలో రోగనిరోధక శక్తి కోసం నిమ్మరసం, కషాయాలు తాగేటప్పుడు అనుకోకుండా ఒకటి రెండు నిమ్మ గింజలు కడుపులోకి వెళ్లినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. నిమ్మ గింజలలో విషపూరిత పదార్థాలు ఉండవని, అవి జీర్ణం కాకపోయినా పేగు గోడలకు అంటుకోకుండా సహజంగానే మలం ద్వారా బయటకు వెళ్లిపోతాయని తెలిపారు. అయితే, ఎక్కువ సంఖ్యలో మింగితే కడుపుబ్బరం, అజీర్ణం వంటి సమస్యలు రావచ్చని, పిల్లల శ్వాసనాళంలో ఇరుక్కునే ప్రమాదం ఉందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్