దేశ రాజధాని ఢిల్లీలో పెరుగుతున్న వాయు కాలుష్యానికి రైతులను నిందించడం సరికాదని సుప్రీంకోర్టు సోమవారం కీలక వ్యాఖ్యలు చేసింది. పంట వ్యర్థాల దహనాన్ని రాజకీయం చేయొద్దని, కాలుష్య నివారణకు శాస్త్రీయ పరిష్కారాలు కనుగొనాలని కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ (CAQM), కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. పంట దహనం చేయకూడదంటే వ్యర్థాలను తొలగించడానికి రైతులకు యంత్రాలు కూడా ఉండాలని పేర్కొంది. కాలుష్య నివారణ చర్యలపై వారంలోపు నివేదిక సమర్పించాలని తెలిపింది.