పాక్ దాడులకు భారత్ సైన్యం గట్టిగా జవాబిస్తుంది. అయితే తాజాగా వీటిపై దర్శక ధీరుడు రాజామౌళి మాట్లాడుతూ.. సైనికుల కదలికలపై వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయొద్దంటూ Xలో తెలిపాడు. భారతీయులందరూ ఆర్మీకి మద్దతుగా ఉండాలని, ఎవరైనా సైనికుల కదలికలు, వాళ్ల చర్యలు చూస్తే ఎలాంటి పరిస్థితుల్లో సోషల్ మీడియాలో అప్లోడ్ చేయొద్దంటూ కోరారు. అలా చేయడం వల్ల పాక్‌కు సహాయం చేసినట్లు అవుతుందని, వాళ్లకు ఛాన్స్ ఇవ్వొద్దంటూ వెల్లడించారు.