
విద్యార్థి ఆత్మహత్య ఘటన.. సీలింగ్ ఫ్యాన్లు తీసేస్తున్న ఐఐటీ బాంబే
ఐఐటీ బాంబే పవయీ క్యాంపస్‌లో విద్యార్థి సాహిల్ రవీంద్ర వకోడే ఆత్మహత్య ఘటనపై నిరసనలు కొనసాగుతున్న నేపథ్యంలో సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. హాస్టల్ గదుల్లోని సీలింగ్ ఫ్యాన్లను తొలగించి, వాటి స్థానంలో వాల్ మౌంటెడ్ ఫ్యాన్లు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. పరీక్ష సమయంలో ఇన్విజిలేటర్‌గా ఉన్న ప్రొఫెసర్‌ను విధుల నుంచి పక్కనపెట్టిన నేపథ్యంలో.. ఆయనకు ఫ్యాకల్టీ ఫోరమ్ మద్దతు తెలిపింది. దర్యాప్తు పూర్తయ్యే వరకు ఎలాంటి తుది నిర్ణయం తీసుకోవద్దని విద్యార్థి ప్రతినిధులు కోరుతున్నారు.




