TG: మున్సిపల్ ఎన్నికల వేళ జూబ్లీహిల్స్‌లోని నివాసంలో మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక సూచనలు చేశారు. మంత్రులు అందరూ జిల్లాలకు వెళ్లాలని, వెనుకబడిన మున్సిపాలిటీలను విశ్లేషించాలని సూచించారు. మున్సిపల్ ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడ్డ నేతలను బుజ్జగించాలని అన్నారు. పాత, కొత్త నేతలు అందరూ సమన్వయంతో ముందుకు వెళ్లాలని సూచించారు. ఒక్క ఓటు కూడా చీలకుండా జాగ్రత్త పడాలని అన్నారు. గెలుపు బాధ్యత పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జులదే అని అన్నారు.