అయోధ్య రామాలయంలో 105 సార్లు విరాళాల చోరీ

8759చూసినవారు
అయోధ్య రామాలయంలో 105 సార్లు విరాళాల చోరీ
అయోధ్య రామాలయంలో 105 సార్లు విరాళాల చోరీ జరిగినట్లు సుప్రీం కోర్టుకు సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం) వెల్లడించింది. ఈ చోరీ దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయినట్లు, చోరీకి పాల్పడిన వారందరినీ గుర్తించినట్లు సిట్ పేర్కొంది. ఆలయానికి వచ్చే విలువైన వస్తువులను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాకర్‌లో భద్రపరిచినట్లు వివరించింది. సిట్ దర్యాప్తు తుది దశకు చేరుకుందని, సెప్టెంబర్ 25 నాటికి ఛార్జ్‌షీట్ దాఖలు చేస్తామని సొలిసిటర్ జనరల్ కోర్టుకు తెలిపారు.

సంబంధిత పోస్ట్