రేపటి నుంచి ‘దోస్త్’ స్పాట్ అడ్మిషన్లు

5567చూసినవారు
రేపటి నుంచి ‘దోస్త్’ స్పాట్ అడ్మిషన్లు
TG:తెలంగాణలో డిగ్రీ కాలేజీల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ కోసం తెలంగాణ ఉన్నత విద్యామండలి స్పాట్ అడ్మిషన్ల షెడ్యూల్‌ను విడుదల చేసింది. 'దోస్త్’ వెబ్‌సైట్‌లో బుధవారం కాలేజీల వారీగా ఖాళీ సీట్లను ప్రకటిస్తారు. గురు, శుక్రవారాల్లో  తొలి విడతలో అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ ఎయిడెడ్ కాలేజీల్లో సీట్లు పొందవచ్చు. ఈ నెల 28, 29 తేదీల్లో రెండో విడత ప్రవేశాలు జరుగుతాయి. స్థానికేతరులకూ అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు. వెబ్‌సైట్‌: https://dost.cgg.gov.in/welcome.do

సంబంధిత పోస్ట్