నెల్లూరులో జంట హత్యల కేసు.. రూ.200 కోసం చంపేశారు

156చూసినవారు
నెల్లూరులో జంట హత్యల కేసు.. రూ.200 కోసం చంపేశారు
AP: నెల్లూరు జిల్లా పెన్నానది వద్ద ఇద్దరు యువకులు హత్యకు గురైన విషయం తెలిసిందే. హతుల్లో ఒకరు గూడారంకు చెందిన పోలయ్యగా, మరొకరు కడపకు చెందిన శివగా గుర్తించారు. శివ నెల్లూరులో ఉంటూ క్యాటరింగ్ పనులు చేస్తుంటాడు. మద్యం తాగి పెన్నానది దగ్గర నిద్రపోతుంటాడు. సోమవారం రాత్రి స్నేహితులతో కలిసి పెన్నానది డ్యామ్‌కు వెళ్తుండగా.. అక్కడే ఉన్న పాత నేరస్థులు సాయి శంకర్, మనోజ్ అడ్డుకున్నారు. రూ.200 ఇవ్వాలని అడగగా.. లేవని చెప్పడంతో శివ, పోలయ్యపై కత్తితో దాడి చేసి చంపేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్