టీడీపీ నేత గొల్లపల్లి అమూల్యకు వరకట్న వేధింపులు

23024చూసినవారు
టీడీపీ నేత గొల్లపల్లి అమూల్యకు వరకట్న వేధింపులు
ఏపీలోని కోనసీమ జిల్లాకు చెందిన రాజోలు టీడీపీ ఇన్ ఛార్జ్, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు కుమార్తె గొల్లపల్లి అమూల్య తన భర్త దొమ్మేటి సునీల్ తనను వరకట్నం కోసం వేధిస్తున్నారని, తనకు, తన పిల్లలకు ప్రాణహాని ఉందని రాజోలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రుల వద్ద నుంచి డబ్బులు తీసుకురావాలని భర్త వేధిస్తున్నారని, రెండుసార్లు హత్యా ప్రయత్నం కూడా చేశారని ఆమె ఆరోపించారు. పోలీసులు ఈ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.