వరకట్న వేధింపులు తాళలేక 27 ఏళ్ల గర్భిణీ ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. సుద్దగుంటిపాల్యకి చెందిన శిల్ప ఓ ప్రముఖ ఐటీ కంపెనీలో జాబ్ చేస్తుంది. పెళ్లిలో రూ.15లక్షల నగదు, 15తులాల బంగారం, శిల్ప భర్త వ్యాపారం పెట్టాడని రూ.5లక్షలు ఇచ్చినట్లు ఆమె తల్లిదండ్రులు తెలిపారు. శిల్ప అందంగా లేదని, విడాకులు ఇచ్చి మంచి అమ్మాయితో పెళ్లి చేస్తానని అత్త తరుచూ వేధింపులకు గురి చేసేది. ఈ క్రమంలోనే శిల్ప మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుంది.