రిచర్డ్ రిషి హీరోగా, రక్షణ ద్రౌపది పాత్రలో నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘ద్రౌపది 2’. నేతాజి ప్రొడక్షన్స్, జిఎం ఫిల్మ్ కార్పోరేషన్ బ్యానర్లపై సోల చక్రవర్తి నిర్మిస్తున్న ఈ సినిమాకు మోహన్. జి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా విడుదలైన రక్షణ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో ఆమె ద్రౌపది దేవిగా గాంభీర్యంగా, హుందాగా ఆకట్టుకుంటున్నారు. ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నారు. జిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు. ప్రేక్షకుల అంచనాలను అందుకునేలా సినిమాను తీస్తున్నామని చిత్ర బృందం తెలిపింది.