
బర్త్ సర్టిఫికెట్ల గడువుపై ఆ దుష్ప్రచారం నమ్మొద్దు: కేంద్రం
జనన ధ్రువీకరణ పత్రాల కోసం దరఖాస్తు చేసుకోవడానికి 2026 ఏప్రిల్ 27 తుది గడువుగా నిర్ణయించినట్లు సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. వాట్సప్‌లో ప్రచారమవుతున్న ఈ సమాచారం పూర్తిగా అవాస్తవమని, ప్రభుత్వం ఎలాంటి నోటిఫికేషన్ లేదా గడువును జారీ చేయలేదని పీఐబీ ఫ్యాక్ట్‌చెక్ విభాగం శుక్రవారం స్పష్టం చేసింది. ప్రజలు ధ్రువీకరణలేని సమాచారాన్ని షేర్ చేయవద్దని, అధికారిక వెబ్సైట్లలోనే సమాచారం చూసుకోవాలని సూచించింది.




