సరైన మోతాదులో నీళ్లు తాగకపోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని, చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు కనీసం మూడున్నర నుంచి నాలుగు లీటర్ల నీరు తాగాలని నిపుణులు సూచిస్తున్నారు. నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల చర్మంపై ముడతలు తగ్గడం, జుట్టు రాలడం తగ్గడం, మొటిమలు, శరీరంలోని మలినాలు బయటకు వెళ్తాయని అన్నారు. గోళ్లు బాగా పెరగడం, ఎండకు దెబ్బతిన్న చర్మం బాగుపడటం, చర్మం కాంతివంతంగా మారడం వంటి ప్రయోజనాలున్నాయి. నీళ్లు తాగకపోతే ముఖం ఉబ్బడం, చర్మం పొడిబారడం, దురద వంటి సమస్యలు వస్తాయంటున్నారు..