వేసవిలో ఈ డ్రింక్స్ తాగండి: ప్రధాని మోదీ

12చూసినవారు
వేసవిలో ఈ డ్రింక్స్ తాగండి: ప్రధాని మోదీ
'మన్ కీ బాత్'లో ఇవాళ ప్రధానమంత్రి మోదీ ప్రసంగించారు. దేశవ్యాప్తంగా తీవ్రమైన వేడి, హీట్ వేవ్ పరిస్థితుల దృష్ట్యా ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తరచూ నీళ్లు తాగాలని, ఎండలో బయటకు వెళ్లవలసి వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. సాంప్రదాయిక భారతీయ పానీయాలను ఉపయోగించి వేడిని తగ్గించుకోవాలని ఆయన సూచించారు. ఆయా రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన లస్సీ, సత్తూ షర్బత్, పానకం, మజ్జిగ తదితర పానీయాల గురించి ప్రస్తావించారు. 'ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్' స్ఫూర్తిని కూడా అవి ప్రతిబింబిస్తాయని వివరించారు.

సంబంధిత పోస్ట్