టీ తాగిన వెంటనే చల్లటి నీళ్లు తాగడం ఆరోగ్యానికి హానికరం అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల జీర్ణ వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడి, గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు వస్తాయని చెబుతున్నారు. దంతాల నొప్పి, రంగు మారడం వంటివి కూడా తలెత్తుతాయని తెలిపారు. వేడి టీ తర్వాత చల్లటి నీళ్లు తాగడం వల్ల ఛాతిలో నొప్పి, కడుపులో ఆమ్లత్వం పెరిగి అనేక ఆరోగ్య సమస్యలు రావచ్చని వైద్యులు సూచిస్తున్నారు.