అతిగా నీళ్లు తాగితే మెదడుకు ముప్పు!

5320చూసినవారు
అతిగా నీళ్లు తాగితే మెదడుకు ముప్పు!
ఢిల్లీలో ఎండలో తిరిగిన వ్యక్తి అతిగా నీళ్లు తాగి ఐసీయూలో చేరాడు. శరీరానికి అవసరమైన లవణాలు అందకుండా కేవలం నీళ్లు మాత్రమే అతిగా తాగడం వల్ల ‘హైపోనాట్రేమియా’ అనే ప్రాణాంతక పరిస్థితి ఏర్పడుతుంది. రక్తంలో సోడియం స్థాయిలు పడిపోయి మెదడు కణాల్లో నీరు చేరి వాపు వస్తుంది. దీనివల్ల తలనొప్పి, వాంతులు, ఫిట్స్, కోమా వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఎండలో ఉన్నప్పుడు ప్లెయిన్ వాటర్ తో పాటు గ్లూకోజ్, ఓఆర్ఎస్, కొబ్బరి నీళ్లు లేదా నిమ్మరసం తీసుకోవాలని, నీటితో పాటు శరీరానికి తగినన్ని ఎలక్ట్రోలైట్స్ అందడం చాలా ముఖ్యంమని వైద్యులు సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్