కేరళలోని పాలక్కడ్‌లో ఒక షాప్ ముందు కారును పార్క్ చేసి ఫోన్ చూసుకుంటూ వెళ్లిన డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల పెను ప్రమాదం తప్పింది. కారును ఎంగేజింగ్ గేర్‌లో ఉంచి, హ్యాండ్‌బ్రేక్ వేయకపోవడంతో వాహనం వెనక్కి వెళ్లి రోడ్డు మధ్యలోకి వచ్చింది. అదృష్టవశాత్తూ, ఆ సమయంలో అటుగా వెళ్తున్న బైక్, పికప్ ట్రక్ వాహనాలు ఢీకొట్టకుండా తప్పించుకున్నాయి. ఈ మొత్తం సంఘటన సీసీ కెమెరాలో రికార్డ్ అయింది.