బస్సు నడుపుతుండగా గుండెపోటు.. 50 మందిని కాపాడిన డ్రైవర్!

43చూసినవారు
AP: బీఆర్ అంబేడ్కర్ కోనసీమ(D) ఆలమూరు(M) మడికి గ్రామానికి చెందిన డి.నారాయణరాజు రాజమహేంద్రవరం డైట్ ఇంజినీరింగ్ కాలేజీ బస్సు డ్రైవర్‌గా పని చేస్తున్నారు. సోమవారం గంటి నుంచి విద్యార్థులను ఎక్కించుకుని కళాశాలకు వెళ్తుండగా ఆయనకు గుండెపోటు వచ్చింది. ఆ టైంలో బస్సులో 50 మంది విద్యార్థులు ఉన్నారు. డ్రైవర్ ముందు చూపుతో వేగాన్ని తగ్గించి బస్సు ఆపి స్టీరింగ్‌పై వాలిపోయారు. అనంతరం విద్యార్థులు గమనించి వెళ్లి చూడగా ఆయన విగతజీవిగా కనిపించారు.

సంబంధిత పోస్ట్