AP: కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో 20 మందికి పైగా చనిపోయినట్లు తెలుస్తోంది. మరో 12 మంది ప్రాణాలతో బయటపడ్డారు. ఈ నేపథ్యంలో ప్రమాద ఘటనపై జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ కీలక ప్రకటన చేశారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయన్నారు. కాసేపట్లో స్పాట్‌కు ఫోరెన్సిక్ టీమ్ చేరుకుంటుందని వెల్లడించారు. ప్రమాదం ఈ స్థాయిలో ఉంటుందని డ్రైవర్లు కూడా అంచనా వేయలేకపోయారని తెలిపారు. ఎమర్జెన్సీ డోర్ పగలగొట్టి కొందరు ప్రయాణికులతో పాటు ఇద్దరు డ్రైవర్లు కూడా సురక్షితంగా బయటపడ్డారని అన్నారు.