ఈ నెల 25 వరకు డ్రైవింగ్ లైసెన్స్ మొబైల్ నంబర్‌తో లింక్ చేయకపోతే సస్పెండ్ చేస్తారనే ప్రచారంలో నిజం లేదని కేంద్రం స్పష్టం చేసింది. వాహనదారులు, లైసెన్స్ హోల్డర్లు తమ మొబైల్ నంబర్‌ను యాక్టివ్‌గా ఉంచుకోవాలని సూచించింది. RTO కార్యాలయానికి వెళ్లకుండానే, సారథి పోర్టల్‌లో రాష్ట్రం ఎంచుకుని, ఓటీపీ ద్వారా ఇంట్లోనే ఉచితంగా నంబర్‌ను అప్‌డేట్ చేసుకోవచ్చని తెలిపింది.