నల్ల సముద్రంలో రష్యన్ ట్యాంకర్‌పై డ్రోన్ దాడి

17717చూసినవారు
నల్ల సముద్రంలో రష్యన్ ట్యాంకర్‌పై డ్రోన్ దాడి
నల్ల సముద్రంలో 'విరాట్' అనే రష్యన్ ఆయిల్ ట్యాంకర్‌పై డ్రోన్ దాడి జరిగింది. సిబ్బంది 'డ్రోన్ దాడి' అంటూ అత్యవసర సందేశం పంపారు. టర్కీ రవాణా మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని ధ్రువీకరించింది. నల్ల సముద్ర తీరం నుంచి 35 నాటికల్ మైళ్ల దూరంలో ఈ దాడి జరిగింది. 'విరాట్'కు స్వల్ప నష్టమే జరిగినప్పటికీ, సిబ్బంది క్షేమంగా ఉన్నారని తెలుస్తోంది. రష్యా 'షాడో ఫ్లీట్' ట్యాంకర్లపై జరిగిన ఈ దాడి తమ పనేనని ఉక్రెయిన్ ప్రకటించింది.

సంబంధిత పోస్ట్