తెలంగాణలో నెలకొన్న కరువు పరిస్థితులకు సీఎం రేవంత్ రెడ్డి వైఫల్యమే కారణమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
కేటీఆర్ ఆరోపించారు. గోదావరిలో నీరు పుష్కలంగా ఉన్నప్పటికీ సాగునీరు అందక పంట పొలాలు ఎడారిగా మారుతున్నాయని ఆయన విమర్శించారు. ఇది ప్రకృతి సిద్ధమైన కరువు కాదని, పాలకులు సృష్టించిన కరువు అని
కేటీఆర్ పేర్కొన్నారు. గోదావరిలో 750 టీఎంసీలు, కృష్ణాలో 258 టీఎంసీల నీటిని రైతులకు అందించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన విమర్శించారు.