కర్ణాటకలోని బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో బందీగా ఉన్న ఐసిస్ రిక్రూటర్ వీఐపీ సౌకర్యాలు పొందుతున్నట్లు చూపిస్తున్న వీడియో ఇటీవల సంచలనం సృష్టించింది. తాజాగా అదే జైల్లో ఖైదీలు మద్యం తాగుతూ పార్టీ చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో బయటకు రావడంతో అధికారులపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వీడియోలో ఖైదీలు పాటలు పాడుతూ, డ్యాన్స్ చేస్తూ, మద్యం తాగుతున్నట్లు కనిపిస్తోంది.