కొచ్చిలో సినీ, సోషల్ మీడియాను కుదిపేస్తున్న భారీ డ్రగ్స్ నెట్ వర్క్ గుట్టురట్టయింది. ఇన్‌ఫ్లుయెన్సర్లతో డ్రగ్స్ దందా నడిపిస్తున్న డ్రగ్స్ మాఫియాను పోలీసులు ఛేదించారు. డ్రగ్స్‌తో పాటు స్టార్ ఇన్‌ఫ్లుయెన్సర్ రిన్సీ ముంతాజ్, ఆమె అనుచరులను పోలీసులు అరెస్ట్ చేశారు. రిన్సీ ముంతాజ్ రెండోసారి MDMA డ్రగ్స్‌తో పట్టుబడగా, 3 కిలోల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మలయాళ సినిమా రంగానికి చెందిన లింకులు వెలుగులోకి వచ్చాయి.