గర్భధారణలో మందుల వాడకం: తల్లి, బిడ్డల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం

15300చూసినవారు
గర్భధారణలో మందుల వాడకం: తల్లి, బిడ్డల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం
గర్భధారణ సమయంలో మహిళల శరీరం అనేక మార్పులకు లోనవుతుంది. ఈ దశలో తల్లి, బిడ్డల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. నొప్పి, జ్వరం, ఇన్ఫెక్షన్లు, విటమిన్ల లోపం వంటి సమస్యలకు వైద్యుల సలహా మేరకు మందులు వాడాల్సి వస్తుంది. అయితే, అన్ని మందులు సురక్షితం కావని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పారాసెటమాల్, ఐబుప్రోఫెన్, కొన్ని యాంటీబయాటిక్స్, ఆస్పిరిన్ వంటివి డాక్టర్ పర్యవేక్షణ లేకుండా తీసుకోకూడదని చెప్తున్నారు. తప్పుడు మందుల వాడకం వల్ల బిడ్డకు పుట్టుకతోనే సమస్యలు, గర్భస్రావం, తల్లికి కాలేయం/కిడ్నీ సమస్యలు, రక్తస్రావం వంటి తీవ్ర పరిణామాలు తలెత్తే ప్రమాదం ఉందంటున్నారు. కాబట్టి, గర్భిణీలు ఎల్లప్పుడూ డాక్టర్ సలహా మేరకే మందులు తీసుకోవాలట.

సంబంధిత పోస్ట్