మద్యం మత్తులో కానిస్టేబుల్‌పై దాడి (వీడియో)

27చూసినవారు
AP: మద్యం మత్తులో కానిస్టేబుల్‌పై ఓ వ్యక్తి దాడి చేశాడు. ఈ ఘటన నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గం సైదాపురం మండల కేంద్రంలో చోటుచేసుకుంది. ట్రాఫిక్‌కు అంతరాయంగా ఉన్న ఆటోని పక్కకి తీయాలని ఆటో డ్రైవర్ వెంకటేశ్వర్లుని కానిస్టేబుల్ ప్రేమ్ కుమార్ కోరారు. మద్యం మత్తులో ఉన్న వెంకటేశ్వర్లు కానిస్టేబుల్‌ను దుర్భషలాడుతూ దాడి చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరలవుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్