AP: అన్నమయ్య జిల్లా బి.కొత్తకోట మండలంలో దారుణం జరిగింది. మద్యం మత్తలో వృద్ధురాలి (65)పై ఓ యువకుడు అత్యాచారం చేశాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో వృద్ధురాలిపై దాడి చేసి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి వృద్ధురాలు చికిత్స పొందుతోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు ఈశ్వర్‌ను గుర్తించి పోలీసులు అరెస్ట్ చేశారు.