TG: కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం పెద్ద మల్లారెడ్డి గ్రామంలో నలుగురు యువకులు గ్రామ పంచాయతీ ట్రాక్టర్‌ను దొంగిలించేందుకు ప్రయత్నించారు. మద్యం మత్తులో ఉన్న వాళ్లు.. చెత్త ట్రాక్టర్‌ను తీసుకెళ్తుండగా ప్రహరీ గోడను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో గోడ ధ్వంసమైంది. దీంతో గ్రామస్తులు ఒక యువకుడిని పట్టుకుని దేహశుద్ధి చేయగా.. మరో ముగ్గురు పరారయ్యారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.