ఇరాన్ వరుస దాడుల నేపథ్యంలో దుబాయ్‌లోని సంపన్నుల్లో వణుకు పుట్టింది. భద్రతా ఆందోళనలతో నగరాన్ని విడిచిపెట్టేందుకు పలువురు ప్రయత్నిస్తున్నారు. దుబాయ్ ఎయిర్‌పోర్టు మూతపడడంతో ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. దీంతో రోడ్డు మార్గంలో సుమారు పది గంటలు ప్రయాణించి రియాద్ చేరుకుని, అక్కడి నుంచి ప్రైవేట్ జెట్‌ల ద్వారా యూరప్ దేశాలకు వెళ్లిపోతున్నట్లు సమాచారం. ఒక్కో ప్రైవేట్ జెట్‌కు సుమారు రూ.3.5 కోట్లు వెచ్చిస్తున్నట్లు తెలుస్తోంది.