
మార్బుల్స్ స్టోన్స్ జారిపడి ఇద్దరు మృతి
TG: మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలో విషాదం చోటు చేసుకుంది. మార్బుల్స్ స్టోన్స్ జారిపడి ఇద్దరు మృతి చెందారు. ట్రాలీ నుంచి మార్బుల్స్ దించుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బంగ్లా తండాకు చెందిన తరుణ్ (25) అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా, గాయపడిన అవినాష్(27)ను ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు వైద్యులు నిర్ధారించారు. కాగా, అవినాష్ ఖమ్మం (D) కామేపల్లి(M) నెమరిపురి వాసిగా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.




