దుల్కర్‌ సల్మాన్‌కు కేరళ హైకోర్టులో ఊరట

210చూసినవారు
దుల్కర్‌ సల్మాన్‌కు కేరళ హైకోర్టులో ఊరట
నటుడు దుల్కర్‌ సల్మాన్‌కు కేరళ హైకోర్టులో ఊరట లభించింది. ఆయన లగ్జరీ కారు స్వాధీనం విషయంలో వారం రోజుల్లోగా నిర్ణయం తీసుకోవాలని కస్టమ్స్‌ విభాగాన్ని న్యాయస్థానం ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల మేరకు దుల్కర్‌ అవసరమైన పత్రాలను కస్టమ్స్‌కు సమర్పించారు. కొన్ని షరతులతో దుల్కర్‌ కారుతో పాటు మరో వ్యక్తి విలాసవంతమైన కారును విడుదల చేసేందుకు కస్టమ్స్‌ అధికారులు నిర్ణయించారు. ఆయా కార్ల విలువలో 20 శాతాన్ని బ్యాంక్‌ గ్యారెంటీగా చెల్లించిన తర్వాత వాటిని విడుదల చేయనున్నారు.

సంబంధిత పోస్ట్