ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘కల్కి-2’పై ఆసక్తికర వార్త ప్రచారంలో ఉంది. తొలి భాగంలో ‘క్యాప్టెన్’గా కనిపించిన దుల్కర్ సల్మాన్.. సీక్వెల్‌లోనూ కీలక పాత్రలో కనిపించనున్నట్లు ఫిల్మ్‌నగర్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. స్క్రిప్ట్‌లో చేసిన మార్పులతో దుల్కర్ పాత్రకు మరింత ప్రాధాన్యం పెరిగినట్లు సమాచారం. అయితే దీనిపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరోవైపు ప్రభాస్ అక్టోబర్ నుంచే ‘కల్కి-2’ షూటింగ్‌లో పాల్గొననున్నట్లు ప్రచారం జరుగుతోంది.