బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో, జమాతే ఇస్లామీ అధినేత షఫీకుర్ రెహమాన్‌ను చైనా రాయబారి యావో వెన్ సోమవారం కలవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇరు దేశాల మధ్య సంబంధాలపై చర్చ జరిగినట్లు సమాచారం. గత ప్రభుత్వ హయాంలో బీఎన్పీ, జమాతే ఇస్లామీతో చైనా సంబంధాలు కొనసాగించలేకపోయిందని, ఇప్పుడు తిరిగి సంబంధాలను పునరుద్ధరించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని చైనా రాయబారి వ్యాఖ్యానించారు. జమాతే ఇస్లామీకి పాకిస్తాన్‌తో మంచి సంబంధాలున్నాయని, ఈ పార్టీ అధినేత చైనా రాయబారితో భేటీ కావడం భారత్‌కు ఆందోళన కలిగించే పరిణామమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.